NASA | చంద్రుడిపై గుహలు.. అక్కడ ఉండొచ్చంటున్న నాసా!
చందమామపై మనుషులు నివశించాలంటే అతి పెద్ద సమస్య కేవలం నీళ్లే కాదు. అక్కడ ఉండే భయంకరమైన వాతావరణం కూడా. చీకటి పడగానే ఆకాశంలో ప్రత్యక్షమై మనపై చల్లని వెన్నెల కురిపించే చందమామపై మాత్రం ఆ సమయంలో చల్లగా ఉండదు. ఏకంగా 127 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
ఇక మనకు కనిపించని చీకటి భాగంలో మైనస్ 173 డిగ్రీల సెల్సియస్ చలి ఉంటుంది. అలాంటి చందమామపై మనుషులు ఎక్కడ ఉండాలి? అనే ప్రశ్నకు తాజా పరిశోధనలో సమాధానం దొరికిందని నాసా పరిశోధకులు అంటున్నారు. చందమామపై మేర్ ట్రాంక్విలిటాటిస్ అనే ప్రాంతంలో చాలా సొరంగాలు ఉన్నాయి.
ఇవన్నీ కూడా గుహలకు దారి చూపిస్తాయని శాస్త్రవేత్తల అంచనా. అంతేకాదు ఈ సొరంగాల వద్ద చేసిన పరిశోధనల్లో వీటి ఉష్ణోగ్రతలు పెద్దగా మారడం లేదని అటూ ఇటుగా 17 డిగ్రీల సెల్సియస్ వద్దనే ఉంటున్నాయని తేలింది. నాసాకు చెందిన లూనార్ రికనసెన్స్ ఆర్బిటర్ ఈ వివరాలను సేకరించింది. అంటే ఈ సొరంగాల్లోకి వెళ్లి అక్కడి గుహల్లో మనుషులు ఉండి, పరిశోధనలు చేయొచ్చని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్ ఏంజెలిస్ (యూసీఎల్ఏ) పరిశోధకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈ గుహల్లో వ్యోమగాములు ఉండి తమ పరిశోధనలు కొనసాగించే అవకాశం ఉందని తెలియజేశారు. ఒకప్పుడు మనిషి గుహల్లోనే బతికేవాడని, ఇప్పుడు మళ్లీ చంద్రుడిపై గుహల్లోనే జీవితం ప్రారంభించాల్సి ఉంటుందని ఈ పరిశోధకులు వివరించారు.
Lunar Reconnaissance Orbiter images of pits indicate that the Moon has caves. Could they become astronaut habitats?
Scientists have discovered that parts of the pits are always about 63°F (17°C), differing from extreme temperatures at the Moon's surfacehttps://t.co/K0sm1CLqal
— ARCHIVED – NASA Moon (@NASAMoon) July 26, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronomers
- Moon
- NASA
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

