వడదెబ్బకు ఐదుగురు మృతి
వడదెబ్బతో బుధవారం ఐదుగురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్తండా ప్రభుత్వ టీచర్ రాణి(45)తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై ఇంటికి వెళ్తుండగా తాండూరు బస్టాండ్‌లోనే కుప్పకూలింది. స్థానికులు జిల్లా దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
- ఎన్నికల శిక్షణకు వెళ్లి వస్తూ టీచర్
- మేడే రోజునే ఆటో కార్మికుడు..
- ఉపాధి పనులకు వెళ్లిన కూలీ
- ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని ఇద్దరు
బషీరాబాద్ / బోథ్/తిమ్మాపూర్/ మియాపూర్/కాచిగూడ,మే 1: వడదెబ్బతో బుధవారం ఐదుగురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లాలోని బషీరాబాద్తండా ప్రభుత్వ టీచర్ రాణి(45)తాండూరులో ఎన్నికల శిక్షణకు హాజరై ఇంటికి వెళ్తుండగా తాండూరు బస్టాండ్‌లోనే కుప్పకూలింది. స్థానికులు జిల్లా దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పరుపుల పల్లెకు చెందిన ఆత్రం జంగు(46) ఉపాధి పనులకు వెళ్లి ఇంటికి వచ్చి కిందపడి మృతిచెందాడు.
హైదరాబాద్‌లోని మియాపూర్‌లోని మీసేవ సమీపంలోని ఫుట్‌పాత్‌పై గుర్తు తెలియని వ్యక్తి (45), కాచిగూడ రైల్వేస్టేషన్ పార్కింగ్ ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వృద్ధురాలు(65) వడదెబ్బతో బుధవారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కార్మిక దినోత్సవం నాడే ఓ ఆటో డ్రైవర్ ఆర్ నర్సయ్య(46) వడదెబ్బబారిన పడి కన్నుమూశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో బుధవారం జరిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

