Plane Crashed | రష్యాలో ఘోర విమాన ప్రమాదం (Plane Crashed) సంభవించింది. ఇవాళ ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines)కు చెందిన ఏఎన్-24 ప్యాసింజెర్ విమానం ఇవాళ ఉదయం బ్లాగోవెష్చెన్స్క్ నుంచి చైనా శివారు ప్రాంతం టైండా పట్టణానికి బయల్దేరింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనంగా.. విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కాంటాక్ట్ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు రాయిటర్స్ నివేదించింది. టైండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. ఆ తర్వాత రెండోసారి ల్యాండింగ్ సమయంలో ఈ విమానం ర్యాడార్ నుంచి గల్లంతై కూలిపోయినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు ప్రమాద స్థలి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. నివేదికల ప్రకారం.. ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది.
An-24 crash site in Russia’s Far East seen from helicopter — social media footage
49 on board, including 5 children and 6 crew — no survivors reported
Malfunction or human error considered as possible causes https://t.co/pLMgFY7kBG pic.twitter.com/rU5VWLOnXH
— RT (@RT_com) July 24, 2025
Also Read..
Elephant | ఏనుగు దాడిలో మల్టీ మిలియనీర్ మృతి
Russian plane: 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యం
Cambodia: థాయ్, కాంబోడియా సరిహద్దుల్లో ఫైరింగ్.. మళ్లీ ఉద్రిక్తలు