Cambodia: థాయ్, కాంబోడియా సరిహద్దుల్లో ఫైరింగ్.. మళ్లీ ఉద్రిక్తలు
Cambodia: థాయ్‌ల్యాండ్, కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. ప్రాచీన ఆలయం ప్రసాత్ త ముఎన్ తోమ్ వద్ద ఈ ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్, కాంబోడియా(Cambodia) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల సైనికులు బోర్డర్ వద్ద ఫైరింగ్ జరిపారు. ప్రాచీన ఆలయం ప్రసాత్ త ముఎన్ తోమ్ వద్ద ఈ ఘటన జరిగింది. థాయ్‌ల్యాండ్‌లోని సురిన్ ప్రావిన్సులో ఈ ఆలయం ఉన్నది. బోర్డర్ ఫైరింగ్‌తో రెండు దేశాల్లో ఉద్రిక్తలు మళ్లీ మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా బోర్డర్ వద్ద ఇలాంటి పరిస్థితి ఉన్నది. అయితే తాజా ఫైరింగ్‌తో మళ్లీ పరిస్థితులు కొత్త దశకు చేరుకున్నాయి. ముందు మీరే కాల్పులు జరిపారంటూ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన ఫైరింగ్‌లో 9 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
కాంబోడియాతో ఉన్న ఈశాన్య బోర్డర్‌ను ఇటీవల థాయ్‌ల్యాండ్ మూసివేసింది. తమ అంబాసిడర్‌ను వెనక్కి రప్పిస్తున్నామని, కాంబోడియా దౌత్యవేత్తను పంపించేస్తున్నామని థాయ్ పేర్కొన్నది. బోర్డర్ వద్ద జరిగిన ల్యాండ్ మైన్ బ్లాస్ట్‌లో థాయ్ సైనికులు గాయపడ్డారు. ఆ ఘటనకు వ్యతిరేకంగా థాయ్ ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో థాయ్‌ల్యాండ్‌తో దౌత్యపరమైన సంబంధాలను తెంచుకుంటున్నట్లు కాంబోడియా ప్రకటించింది. బ్యాంగ్‌కాక్‌లో ఉన్న ఎంబసీ సిబ్బందిని కూడా కాంబోడియా వెనక్కి రప్పించింది.
జూలై 16వ తేదీన పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనికుడు.. ల్యాండ్‌మైన్ బ్లాస్ట్‌లో కాలు కోల్పోయినట్లు థాయ్ అధికారులు తెలిపారు. థాయ్‌ల్యాండ్‌లోని ఉబన్ రచ్చతాని, కాంబోడియాలోని ప్రేహ వియర్ ప్రావిన్సు మధ్య గత కొన్నాళ్లుగా వివాదం చెలరేగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

