ఆదివారం 29 మార్చి 2020
International - Feb 25, 2020 , 15:39:13

మేడం మెలానియా.. పంజాబీ పాటకు ఫిదా

మేడం మెలానియా.. పంజాబీ పాటకు ఫిదా

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నానక్పూర్‌లో గల సర్వోదయా ప్రభుత్వ పాఠశాలను   అమెరికా ప్రథమ మహిళ  మెలానియా ట్రంప్‌ సందర్శించారు.  పాఠశాలలో అమలు చేస్తున్న హ్యాపినెస్‌ విద్యా విధానాన్ని  మెలానియా స్వయంగా పరిశీలించారు.  క్లాస్‌రూంలో చిన్నారులతో ముచ్చటించిన మెలానియా.. విద్యార్థులు వేసిన సూర్య నమస్కారాలు ఆసక్తిగా తిలకించారు. తరగతి గదిలో టీచర్‌గానూ మారిన మెలానియా  చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల డ్యాన్స్‌ను చూస్తూ ఉత్సాహంగా గడిపారు.  పాఠశాల ఆవరణలో స్టేజ్‌పైన కొంతమంది విద్యార్థినులు పంజాబీ పాటకు  నృత్యం చేస్తుండగా  విద్యార్థుల పక్కన కూర్చున్న మెలానియా చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్‌ చేయడం ఆద్యంతం ఆకట్టుకుంది. logo