Massive waves | అమెరికాని శీలాకాల తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్ (New York) రాష్ట్రంలో ఉన్న వెస్ట్‌ఫీల్డ్ (Westfield) అనే పట్టణాన్ని బలమైన గాలులు (strong wind) కుదిపేశాయి. 50 నాట్ల వేగంతో వీచిన గాలులకు తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ గాలుల ధాటికి ఎరీ సరస్సు (Lake Erie)లో అలలు (Massive waves) ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. భారీ శబ్దంతో ఆరు నుంచి 11 అడుగుల మేర ఎసగిపడ్డ అలలను చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఈ ప్రాంతంలో అధికారులు వాతావరణ హెచ్చరికలు జారీ చేశారు.
MASSIVE 25-FOOT waves are BLASTING the seawall in Westfield, NY right now—producing thunderous booms, almost like mini explosions on impact. Easily the most terrifying wave action I’ve ever witnessed 🤯🌊 @ryanhallyall @WxWiseApp pic.twitter.com/DLhukTahcU
— Jaden Pappenheim (@PappenheimWx) December 29, 2025
Also Read..
Zelensky: భారత వైఖరిని తీవ్రంగా తప్పుపట్టిన జెలెన్స్కీ
New year 2026 | న్యూ ఇయర్ వేడుకలు ఏ దేశంలో ముందు జరుగుతాయో తెలుసా..?
India | మూడో పక్షం జోక్యం లేదు.. ఇండోపాక్ ఉద్రిక్తతలపై చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్