కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసినట్లు వచ్చిన వార్తలను భారత్తో సహా పలు దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. అయితే భారత ప్రధాని మోదీ చేసిన ఖండనను ఉక్రెయిన్ తప్పుపట్టింది. కొన్ని దేశాలు గందరగోళంగా, అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నాయని, పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడి ఘటనను ఖండిస్తున్నట్లు ఇండియా, యూఏఈ దేశాలు పేర్కొన్నాయని, వాస్తవానికి ఆ దాడి జరగలేదని ఆన్లైన్ మీడియా సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Zelensky) తెలిపారు.
⚡️🇷🇺Russian Defense Ministry reveals flight path of Ukrainian drones targeting Putin’s residence pic.twitter.com/Rj0z0QHhxx
— Sputnik India (@Sputnik_India) December 31, 2025
డిసెంబర్ 28వ తేదీ రాత్రి పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ సుమారు 91 కమికేజ్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడి చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్రోవ్ తెలిపారు. నోవ్గోరాడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ ఇంటిపై అటాక్ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ దాడిలో ఎవరికీ ఏమీకాలేదన్నారు. భౌతిక నష్టం కూడా జరగలేదన్నారు. అన్ని యూఏవీలను రష్యా కూల్చివేసిందన్నారు. అయితే ఆ దాడి తాము చేయలేదని ఉక్రెయిన్ నేత జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా చేస్తున్న దాడులతో మా పిల్లలు మరణిస్తున్నారని, ఇలాంటి సంఘటనలను ఏ దేశం కూడా ఖండించడం లేదని, ఇండియా కానీ లేక యూఏఈ కానీ ఆ ఘటనలను ఖండించడం లేదని జెలెన్స్కీ అన్నారు.
The footage, released by Russia’s Defense Ministry, is said to show a Ukrainian drone brought down en route to President Putin’s residence, allegedly carrying a six‑kilogram high‑explosive payload. pic.twitter.com/42F1PamfDr
— Open Source Intel (@Osint613) December 31, 2025