గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 25, 2020 , 15:16:56

చైనా కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కెనడాలో రేపు భారీ నిరసన

చైనా కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కెనడాలో రేపు భారీ నిరసన

హైద‌రాబాద్ : చైనా క‌మ్యూనిస్ట్ పాల‌న‌కు వ్య‌తిరేకంగా కెన‌డాలో రేపు భారీ నిర‌స‌న కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. చైనా, హాంకాంగ్, టిబెట్, జిన్జియాంగ్, ఇండియా, ఫిలిప్పీన్స్ నుండి పూర్వీకుల మూలాలు కలిగిన కెనడియన్లు రేపు వాంకోవర్ ఆర్ట్ గ్యాలరీ వెలుపల ర్యాలీని నిర్వహించ‌నున్నారు.  హాంకాంగ్ వాసులు, టిబెటిన్లు, ఆక్ర‌మిత తూర్పు తుర్కి‌స్తాన్ ప‌ట్ల అణచివేత‌ను అదేవిధంగా పొరుగు దేశాలైన భార‌త్‌, పిలిప్పీన్స్ ప‌ట్ల దూకుడు వైఖ‌రిని నిర‌స‌న‌కారులు ఖండించారు.

2018 డిసెంబర్‌లో చైనాలో అదుపులోకి తీసుకున్న కెన‌డా వాసులు మైకేల్ కోర్విగ్‌, మైఖేల్ స్ప‌వ‌ర్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల్సిందిగా నిర‌స‌నకారులు డిమాండ్ చేస్తున్నారు. గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల‌పై చైనా వీరిని అరెస్టు చేసింది. కాన్సంట్రేష‌న్ క్యాంప్‌ల్లో నిర్భందించిన ఒక మిలియ‌న్ ఉయ్‌గ‌ర్ ముస్లింల ప్రాథ‌మిక మాన‌వ హ‌క్కుల‌ను గౌర‌వించాల్సిందిగా బీజింగ్‌ను డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ తన సొంత ప్రజలు, ఇతర దేశాల పట్ల దురాక్రమణకు వ్యతిరేకంగా కెనడాలో జరిగే మొదటి బహుళజాతి ర్యాలీ ఇది. 

ఈ ర్యాలీని కెనడా టిబెట్ కమిటీ, టిబెటన్ కమ్యూనిటీ, ఫ్రెండ్స్ ఆఫ్ కెనడా ఇండియా ఆర్గనైజేషన్, గ్లోబల్ పినాయ్ డయాస్పోరా కెనడా, వాంకోవర్ సొసైటీ ఆఫ్ ఫ్రీడం, డెమోక్రసీ అండ్‌ హ్యూమన్ రైట్స్ ఫర్ చైనా, వాంకోవర్ సొసైటీ ఇన్ సపోర్ట్ ఆఫ్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్, వాంకోవర్ ఉయ్‌గ‌ర్ సంయుక్తంగా నిర్వ‌హించ‌నున్నాయి. 


logo