టోక్యో: జపాన్ ఉత్తర తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.4గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు ఉత్తర జపాన్‌లో సన్నికు ప్రాంతంలో భూకంపం సంభవించింది. సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎత్తయిన ప్రదేశాల్లోనే ఉండాలని అధికారులు పౌరులకు సూచించారు. భూకంపం అనంతరం ఉత్తర జపాన్ తీర ప్రాంతంలో పలు చోట్ల చిన్న స్థాయిలో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. జపాన్‌లో భూకంపం కారణంగా జారీ చేసిన సునామీ హెచ్చరికల ప్రభావం మనదేశంపై ఉండబోదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేసన్ సర్వీసెస్ వెల్లడించింది.