Russia-Ukraine War | ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) భీకర దాడికి పాల్పడింది. రాజధాని కీవ్ (Kyiv)పై డ్రోన్ల (drone)తో విరుచుకుపడింది. ఈ దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 48 మంది గాయపడ్డారు. మాస్కో దాదాపు 598 డ్రోన్లు, 31 క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ వర్గాలు వెల్లడించాయి.
మృతుల్లో 2, 14, 17 ఏళ్ల వయస్సు గల ముగ్గురు పిల్లలు కూడా ఉన్నట్లు కీవ్ అధికారి ఒకరు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దాడి ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పందం దిశగా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం.
కాగా, గతవారం రష్యాపై ఉక్రెయన్ భీకర దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా పశ్చిమ ప్రాంతంలోని కుర్స్క్‌లోని అణు విద్యుత్ ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. అనేక ఇంధన, విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేసినట్లుగా రష్యన్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. డ్రోన్ దాడిలో ప్లాంట్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిందని.. రేడియేషన్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా కూడా ఉక్రెయిన్‌పై 72 డ్రోన్లు, ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించింది.
Also Read..
PM Modi | చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక సమావేశం