శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 04, 2020 , 11:56:49

అద్భుతం.. పుచ్చ‌కాయ ముక్క‌ల‌తో సంగీతం : వీడియో వైర‌ల్

అద్భుతం.. పుచ్చ‌కాయ ముక్క‌ల‌తో సంగీతం :  వీడియో వైర‌ల్

మ‌న‌సు పెట్టి ఆలోచించాలే కాని రాళ్ల నుంచి అయినా సంగీతాన్ని వెలికి తీయ‌వ‌చ్చు. అయితే ఇత‌ను రాళ్ల నుంచి కాదులే కాని పుచ్చ‌కాయ‌తో మ్యూజిక్ ప్లే చేస్తున్నాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా. చేయాల‌నుకుంటే సాధ్యం కానిదేదీ లేదు. నిమిషం పాటు న‌డిచే ఈ వీడియోను మిజెర్గ్ అనే ట్విట‌ర్ ఖాతా షేర్ చేసింది. ఈ ఆర్టిస్ట్ తెలివికి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. పుచ్చ‌కాయ‌, కివీ పండ్ల‌ను ఉప‌యోగించి ఎంత అద్భుతంగా మ్యూజిక్ ప్లే చేశాడో వీడియోలో చూస్తే నివ్వెర‌పోతారు.

పుచ్చ‌కాయ‌ను చూస్తే కోసుకొని తినాలనుకునేవాళ్లు ఉన్నారు. ఇత‌నికి మాత్రం మ్యూజిక్ ప్లే చేయొచ్చు అనే ఆలోచ‌న వ‌చ్చింది. పుచ్చ‌కాయ‌ను స‌న్న‌ని ముక్క‌లుగా క‌ట్ చేశారు. వీటికి ఎల‌క్ట్రిక‌ల్ స‌ర్క్యూట్‌కు అనుసంధానం చేశారు. కొన్ని వైర్లు తీసుకొని పుచ్చ‌కాయ‌, కివీస్‌ల‌ను ఒక మెట‌ల్ బోర్డుకు ఆ త‌ర్వాత ల్యాప్‌ట్యాప్‌కు ఈ వైర్ల‌ను క‌లిపాడు. కాల్ల ద‌గ్గ‌ర డ్ర‌మ్ సెట్ చేసుకున్నారు. ప‌వ‌ర్ బ‌ట‌న్ ఆన్ చేయ‌గానే పియానో ప్లే చేసిన‌ట్లుగా పుచ్చ‌కాయ ముక్క‌ల‌తో మీద వేళ్ల‌తో ట‌చ్ చేస్తున్నాడు. అంతే న‌చ్చిన మ్యూజిక్‌ను ప్లే చేస్తున్నాడు. ఇంత క్రియేటివిటీ ఉన్న వీడియో వైర‌ల్ కాకుండా ఉంటుందా.. ఇప్ప‌టికే 1.4 మిలియ‌న్ల మంది వీక్షించారు. 


logo