Falcon | పక్షులకు పాస్‌పోర్ట్‌తో పనేముంటుంది చెప్పండి.. విమానాల్లా అవే స్వయంగా గాల్లో ఎగురుకుంటూ ఎక్కడికైనా వెళ్లగలవు. అయితే, అబుదాబిలో మాత్రం ఓ డేగ (Falcon) పాస్‌పోర్ట్‌తో విమానాల్లో ప్రయాణిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఆ డేగకు సొంతంగా పాస్‌పోర్ట్ (own passport) కూడా ఉందండోయ్..
అబుదాబికి (Abu Dhabi) చెందిన ఓ వ్యక్తి మొరాకో (Morocco)కు విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో తనతోపాటు పెంపుడు డేగను కూడా విమానంలో తీసుకెళ్లాడు. ఆ డేగకు పాస్‌పోర్ట్ కూడా ఉండటం విశేషం. డేగతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సదరు వ్యక్తితో కొందరు మాటకలిపారు. డేగ గురించి ప్రశ్నించారు. దాన్ని మీతోపాటు విమానంలో తీసుకెళ్తున్నారా..? అని అడిగారు. అవును అంటూ అతడు సమాధానం ఇచ్చాడు. అంతేకాదు డేగకు పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నట్లు చెప్పాడు. ఆ పాస్‌పోర్ట్‌లో డేగకు సంబందించిన వివరాలన్నీ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
Also Read..
Donald Trump | పోప్ అవతారమెత్తిన ట్రంప్.. నెట్టింట విమర్శలు
Pahalgam attack | పాక్‌కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం