Kamala Harris | అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట షేక్ చేస్తోంది. బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco)లో జరిగిన ఎమర్జ్ అమెరికా 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన కమలా హారిస్.. 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు (Kamala Harriss dance moves). కంటెంట్ క్రియేటర్ కెన్నెత్ వాల్డెన్తో కలిసి కాలు కదిపి అందరినీ ఉత్సాహపరిచారు.
ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఇంటర్నెట్ సెన్సేషనల్ ‘బూట్స్ ఆన్ ది గ్రౌండ్’ (Boots on the Ground)కి సరదాగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోయిన తర్వాత హారిస్ ఇలా బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో ట్రంప్ విధానాలపై కమలా హారిస్ తీవ్రంగా స్పందించారు. సుంకాలు, వలసల విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. దేశం ప్రమాదంవైపు చాలా వేగంగా కదులుతోందని హెచ్చరించారు.
కాగా, గతేడాది నవంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ అధ్యక్షురాలి పదవికి పోటీ పడిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన కమలా హారిస్.. ట్రంప్ చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె బయట ఎక్కువగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తన సొంత రాష్ట్రం కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు వచ్చే ఏడాది జూన్లో జరగనున్నాయి. ఈ వేసవి చివరి వరకు దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read..
Donald Trump | పోప్ అవతారమెత్తిన ట్రంప్.. నెట్టింట విమర్శలు
Pahalgam attack | పాక్కు షాక్.. ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై భారత్ నిషేధం