న్యూయార్క్: భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. ఈ అధ్యయన వివరాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూమిపై జీవం ఎలా ఆవిర్భవించిందనే అంశంపై ఇప్పటివరకు అనేక సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి. ‘ప్రీబయోటిక్ కెమిస్ట్రీ’ ద్వారా ఏర్పడ్డ రసాయన సమ్మేళనాల ఫలితంగా జీవం మొదలయ్యిందనే సిద్ధాంతం ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉంది. అయితే, ఈ ప్రక్రియకు అవసరమైన భాస్వరం, సల్ఫర్, నత్రజని, కర్బనం వంటి మూలకాలు భూమిపై ఉన్న శిలల్లో ప్రతిక్రియాశీల, కరిగే రూపంలో సరిపడేంత లేవని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాబట్టి, ‘ప్రీబయోటిక్ కెమిస్ట్రీ’ పద్ధతిలో జీవం ఏర్పడి ఉండకపోవచ్చన్నారు.