e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News ర‌ష్యా తురుపుముక్క లెనిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

ర‌ష్యా తురుపుముక్క లెనిన్‌.. చ‌రిత్ర‌లో ఈరోజు

వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియానోవ్ 1870 సంవత్సరంలో స‌రిగ్గా ఇదే రోజున ర‌ష్యన్ సామ్రాజ్యంలోని సింబిర్క్స్‌లో జన్మించారు. లెనిన్ పేరుతో అందిరికీ సుప‌రిచితుడు. రష్యా విప్లవ నాయకుడు, కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త. ఇతడు 1917లో జరిగిన అక్టోబర్ విప్లవం ప్రధాన నాయకుడుగా వ్య‌వ‌హ‌రించారు. రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ లేదా ‘బోల్షెవిస్ట్ రష్యా’ దేశానికి మొదటి అధినేతగా ఉన్నారు. 1922 వరకు ఆ పదవిలో కొనసాగారు.

విప్లవచర్య నిమిత్తం తనకు యిష్టమైనవన్నీ వదలి, యించుమించు సన్యాసి జీవితాన్ని బలవంతాన అలవాటు చేసుకున్నారు. లాయర్ గా పనిచేసి వదిలేశారు. తన రాజకీయ చర్య దృష్ట్యా లెనిన్ విపరీతంగా రచనలు చేశాడు. ప్లెఖనోవ్ స్థాపించిన ఇస్ క్రా వ్యవస్థ ద్వారా లెనిన్ ప్రాధాన్యత చెందారు.

- Advertisement -

1897 లో లెనిన్ తిరుగుబాటు వైఖరి కారణంగా అతడ్ని జార్ పోలీసులు అరెస్టు చేసి సైబీరియాకు మూడు సంవత్సరాలు పంపించారు. ఇక్కడే అతను నడేజ్డా క్రుప్స్కాయను వివాహం చేసుకున్నారు. లెనిన్ పశ్చిమ ఐరోపాలో దాదాపు 15 సంవత్సరాలు గడిపి అక్క‌డి అంతర్జాతీయ విప్లవాత్మక ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించడం ప్రారంభించారు. రష్యన్ సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ యొక్క ‘బోల్షివిక్’ వర్గానికి నాయకుడు అయ్యారు.

ఐరోపాలో శ్రామికులకు వ్యతిరేకంగా ఉద్యమం చేశాడు. ఈ వ్యతిరేకత పెట్టుబడిదారీ విధానాన్ని పడగొట్టడానికి మరియు సోషలిజం స్థాపనకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 1917 లో రష్యాలో జార్ పాలన ముగిసినప్పుడు, మధ్యంతర ప్రభుత్వం స్థాపించబడింది. దీనితో, అతను రష్యాకు తిరిగి వచ్చి దేశానికి నాయకత్వం వహించారు. 1917 లో ఆయన నాయకత్వంలో జరిగిన విప్లవాన్ని బోల్షివిక్ విప్లవం అని కూడా అంటారు. 1922 లో తీవ్ర అనారోగ్యానికి గురై కూడా పొలిట్‌బ్యూరోకు ప‌నిచేశారు. చివ‌ర‌కు 1924 జ‌న‌వ‌రి 21 న క‌న్నుమూశారు.

నేడు ప్ర‌పంచ ధ‌రిత్రి దినం

మాతృభూమికి కృతజ్ఞతలు చెప్పాల్సిన రోజు ఇది. భూమిని పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు దృఢ సంకల్పం తీసుకోవాల్సిన రోజు ఇది. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకొచ్చేందుకు ఏటా ఇవాల ప్ర‌పంచ ధ‌రిత్రి దినోత్స‌వాన్ని జ‌రుపుతున్నాం. ధరిత్రీ దినోత్సవాన్ని నిర్వహించాలనే భావనను మొదటగా తీసుకొచ్చిన డేనిస్‌ హేస్‌ అనే వ్యక్తి అమెరికాలో 1970లో దీనిని నిర్వహించారు. అనంతరం ఇది ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. ఈ ధరిత్రీ దినోత్సవాన్ని 192 దేశాలు అమలు చేస్తున్నాయి.

1969 జనవరి 28న శాంటా బార్బరా సముద్రతీరం చమురు తెట్టులతో నిండింది, సమద్రతీరమే ఆలంబనగా ఉన్న వందలాది జీవజాతులు మృత్యువాతపడ్డాయి. సుమారు నాలుగువేల పక్షుల రెక్కలు ఆ చమురు తెట్టులో చిక్కుకొని ఎగిరే దారిలేక అవి ప్రాణాలొదిలాయి. ఇలా జీవ వైవిధ్యం కొడిగట్టింది. ప్రపంచ ధరిత్రి దినోత్సవానికి ఆనాటి సంఘటన పునాదిగా మారింది.

మొక్కలు, జంతువులు, పక్షులు ధరిత్రిపై జీవనాన్ని పంచుకుంటున్నాయి. వాటితో సామరస్యంగా మెలగడం మన బాధ్యత. అందుకే ప్రజలందరికీ ప్రకృతి, ప్రకృతి వనరుల పరిరక్షణపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులవల్ల ధరిత్రికి పొంచి ఉన్న ప్రమాదాలు, మార్పుపై అవగాహన పెంచుకోవాలి. నానిటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని త‌గ్గించేందుకు మ‌న‌వంతు క‌ర్త‌వ్యంగా వీలైన‌న్ని మొక్క‌లు నాటుదాం. ధ‌రిత్రిని కాపాడుకుందాం.

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2016: వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందంపై సంత‌కాలు చేసిన‌ 170 కి పైగా దేశాలు

2013: భారతదేశపు ప్రముఖ వయోలిన్ లాల్గుడి జయరామన్ మరణం

2001: మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ మహమూద్ అలీ ఖాన్ కన్నుమూత‌

1958: భారత నావికాదళానికి మొదటి భారత చీఫ్‌గా నియ‌మితులైన అడ్మిరల్ ఆర్‌డీ కటారి

1931: శాంతి ఒప్పందంపై సంతకం చేసిన ఈజిప్ట్, ఇరాక్

1921: ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు రాజీనామా చేసిన సుభాష్ చంద్రబోస్

1915: మొదటి ప్రపంచ యుద్ధంలో మొద‌టిసారి విష వాయువును ఉపయోగించిన‌ జర్మన్ సైన్యం

1760: భారతదేశపు చివరి మొఘల్ చక్రవర్తి అక్బర్ II జననం

ఇవి కూడా చదవండి..

ఐక్యరాజ్య సమితి ముఖ్య కమిటీల్లో భారత్‌ సభ్యత్వం

చాద్‌ అధ్యక్షుడు ఇద్రిస్‌ డెబ్బీ దారుణహత్య

హాయిగా నిదురపో.. జ్ఞాపకశక్తి పెంచుకో..!

వేగాన్‌లలో ఎముకల పగుళ్లు.. పరిశోధకుల హెచ్చరిక

ఉద్రిక్తతలను పెంచుతున్న ఉత్తర కొరియా కదలికలు

జపాన్ ప్రధాని భారత పర్యటన రద్దు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement