Kim Jong Un | మరోసారి బహిరంగంగా కనిపించిన కిమ్ కుమార్తె
Kim Jong Un | ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్ జు యే (Kim Ju Ae)కు ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది.
Kim Jong Un | ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె కిమ్ జు యే (Kim Ju Ae)కు ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. గత మూడేళ్లుగా తండ్రి కిమ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కిమ్ జు యే అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తున్నారు. ఆమెను కిమ్ వారసురాలిగా స్థానిక మీడియా పేర్కొంటోంది.
ఈ నేపథ్యంలో కిమ్ జు యే తాజాగా మరోసారి బహిరంగంగా కనిపించారు. తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం ‘కుమ్సుసన్’ స్మారకాన్ని (Kumsusan mausoleum) ఆమె సందర్శించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ మాజీ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్‌గా మారాయి.
2009లో రి సోల్ జుతో కిమ్‌కు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే, ముగ్గురు పిల్లల్లో కేవలం కుమార్తె జు యే గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలిసింది. ఆమె అంటే కిమ్‌కు చాలా ఇష్టమట. 2022లో తొలిసారి జుయేని కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి తండ్రితోపాటూ పలు అధికారిక కార్యక్రమాల్లో జుయే మెరిశారు.
ఇటీవలే ఆమెను తొలిసారి విదేశీ పర్యటనకు కూడా తీసుకెళ్లారు కిమ్. గతేడాది సెప్టెంబర్ 2న చైనా పర్యటనకు తీసుకెళ్లారు. చైనా విజయోత్సవాల సందర్భంగా జరిగిన సైనిక కవాతుకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఇలాంటి హై ప్రొఫైల్ ఈవెంట్లో ఆమె పాల్గొనడాన్ని బట్టి కిమ్ జోంగ్ ఉన్‌కు భావి వారసురాలిగా ఆమెను పరిచయం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తర కొరియాకు కాబోయే నేత ఆమే అన్న సందేహాలు నెలకొన్నాయి.
Also Read..
NASA Library: అతిపెద్ద నాసా లైబ్రరీ మూసివేత.. డోనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు
Mars: అంగారక గ్రహంపై నీటి గుహలు.. గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు
పిల్లలకు సోషల్‌మీడియా బ్యాన్ ఆస్ట్రేలియా బాటలో ఫ్రాన్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

