న్యూయార్క్: అంగారక గ్రహం(Mars)పై నీటి గుహలను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. హిబ్రుస్ వాలీస్ ప్రాంతంలో ఆ గుహలు ఉన్నట్లు తేల్చారు. నీటి వల్ల గుహలు ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. భూమి కాకుండా మరో గ్రహంపై నీటి గుహలను గుర్తించడం ఇదే మొదటిసారి. మార్స్ గ్రహంపై అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడిన గుహలను గతంలో గుర్తించారు. కానీ రాళ్లలోని రసాయనాల వల్ల నీటి గుహలు ఏర్పడినట్లు తాజా రిపోర్టులో తేల్చారు. ద ఆస్ట్రోఫిజికల్ జనరల్ లెటర్స్లో ఈ స్టడీకి చెందిన నివేదిక ఇచ్చారు.
నీటి గుహల ఆవిష్కరణ మార్స్ గ్రహంపై జీవం ఉందన్న ఆధారాలను స్టడీ చేసేందుకు ఊతం ఇచ్చేలా ఉన్నది. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ గుహలు ఏర్పడినట్లు తేల్చారు. భవిష్యత్తు అన్వేషణలకు ఈ గుహలను స్టడీ చేయనున్నారు. 2025 అక్టోబర్ 30న ఆ అధ్యయనానికి చెందిన డేటాను పబ్లిష్ చేశారు. నాసా శాటిలైట్ల నుంచి సేకరించిన డేటా ఆధారంగా చైనా శాస్త్రవేత్తలు రిపోర్టు ఇచ్చారు.
గతంలో గుర్తించిన లావా ట్యూబ్లతో పోలిస్తే హిబ్రుస్ వాలీస్లో ఉన్న నీటి గుహలు భిన్నంగా ఉన్నట్లు ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో రాశారు.