Kamala Harris | అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) ఓ ఫ్యాషన్ ఈవెంట్లో మెరిశారు. తొలిసారి రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటైన మెట్‌గాలా సోమవారం ఉదయం గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art)లో జరిగిన ఈ గాలాలో ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరై సందడి చేశారు. ఈ గాలాలో కమలా హారిస్ తొలిసారి రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టారు. కస్టమ్ క్రియేషన్ ఆఫ్-వైట్ గౌను (Off White gown) ధరించి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి బాగా పేరున్న అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే ఈ గాలాకు హాజరై సందడి చేస్తుంటారు. ఈ ఏడాది కూడా మెట్‌గాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈవెంట్లో భారత్ నుంచి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), కియారా అడ్వాణీ (Kiara Advani), ప్రియాంక చోప్రా, నిక్‌జొనాస్, సింగర్ దిల్జిత్ దోసాంజ్, నటాషా పూనావాలాతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ చిన్న కుమార్తె ఇషా అంబానీ (Isha Ambani) తదితరులు రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. ‘సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్’ థీమ్‌లో విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్‌పై హొయలుపోయారు.
Also Read..
Met Gala | మెట్ గాలాలో మెరిసిన బీటౌన్ తారలు.. డిఫరెంట్ లుక్‌లో షారుఖ్.. PHOTOS
Kiara Advani | బేబీ బంప్‌తో స్టార్ నటి.. ఫొటోలు వైరల్
Thalapathy Vijay | దళపతి విజయ్ అభిమానిపై తుపాకీ గురి పెట్టిన బాడీగార్డ్.. వీడియో