Thalapathy Vijay’s bodyguard | మధురై ఎయిర్పోర్ట్ వద్ద తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ను కలవడానికి వచ్చిన ఒక అభిమానిపై విజయ్ బాడీగార్డ్ తుపాకీ గురిపెట్టిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. విజయ్ తన తదుపరి చిత్రం జననాయకన్ షూటింగ్ కోసం కొడైకెనాల్ వెళ్లేందుకు మధురై చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. విజయ్ మధురై ఎయిర్పోర్ట్కి రాబోతుండగా.. అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి విజయ్ వాహనాన్ని అనుసరించారు. ఈ క్రమంలో, ఒక అభిమాని విజయ్ను సమీపించే ప్రయత్నం చేయగా, బాడీగార్డ్ అతన్ని కట్టడి చేద్దమని భావించి తుపాకీ ఎక్కుపెట్టాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు బాడీగార్డ్ చర్యను సమర్థిస్తుండగా, మరికొందరు అంతగా స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. తుపాకీ గురి పెట్టిన అభిమాని మాట్లాడుతూ, భద్రతా సిబ్బంది తనను విజయ్ రక్షణ కోసమే అలా చేశారని, వారిని తప్పు పట్టనని చెప్పాడు. మరోవైపు, విజయ్ భద్రతా సిబ్బంది మాత్రం ఆ సమయంలో అభిమాని ఒక్కసారిగా దగ్గరకు రావడంతో ఆయుధాన్ని సురక్షితంగా ఉంచే ప్రయత్నంలో అలా జరిగిందని తెలిపారు.
விஜய்க்கு சால்வை போட வந்த தொண்டரை இழுத்து தள்ளி தலையில் துப்பாக்கி வைத்த விஜய்யின் பாதுகாவலர்கள்.
கண்டுக்காமல் சென்ற விஜய்😤 pic.twitter.com/kJXuwnSUEO
— MR.Anil (@Saffron_Anil_) May 5, 2025