Earthquake | జపాన్ (Japan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. ఇవాటే ప్రిఫెక్చర్ తీరం (Iwate coast)లో ఆదివారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అధికారులు సునామీ ( tsunami) హెచ్చరికలు జారీ చేశారు. ఇవాటే తీరప్రాంతంలో కొన్ని ప్రాంతాలను 1 మీటరు ఎత్తు వరకు అలలు తాకవచ్చు అని హెచ్చరించారు. ప్రజలు తీర ప్రాంతాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని మరిన్ని ప్రకంపనలు తాకవచ్చని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా, సురక్షితంగా ఉండాలని పేర్కొన్నారు.
Also Read..
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు
Helicopter Crashes | కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి