Lunar mission | నేడు జపాన్ లూనార్ మిషన్ ప్రయోగం.. జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యం
ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయత్తమవుతున్నది.
Lunar mission | టోక్యో, ఆగస్టు 27: ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయత్తమవుతున్నది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వేస్టిగేటింగ్ మూన్ (స్లిమ్) పేరిట జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా నేడు (సోమవారం) చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపించనున్నది.
జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్లోని యోషినోబు లాంచ్ కాంప్లెక్స్ నుంచి హెచ్2-ఏ రాకెట్ సోమవారం నింగిలోకి దూసుకెళ్లనున్నది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో చేస్తున్న ఈ ప్రయోగం సఫలమైతే జాబిల్లిపై ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించనున్నది. కాగా, ప్రయోగించిన 3-4 నెలల తర్వాత ఈ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరనున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- India
- Japan
- Lunar Mission
- Russia
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

