డ్రగ్ పెడ్లర్ అరెస్టు.. 2.5 లక్షల హ్యాష్ ఆయిల్ స్వాధీనం
ఈగల్ స్టేట్ టాస్‌ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర శ్రీనివాస్ అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టుచేశారు. అతని నుంచి 330 గ్రాముల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.2.5 లక్షలు ఉంటుందని ఈగల్ పోలీసులు తెలిపారు.
- డ్రగ్ పెడ్లర్ నరేంద్ర శ్రీనివాస్ అరెస్టు
హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ఈగల్ స్టేట్ టాస్‌ఫోర్స్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన నరేంద్ర శ్రీనివాస్ అనే డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టుచేశారు. అతని నుంచి 330 గ్రాముల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.2.5 లక్షలు ఉంటుందని ఈగల్ పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పరిధి గుర్రంగూడలో నివాసం ఉంటున్న నరేంద్ర శ్రీనివాస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసైన అతను, గతంలో డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అనంతరం కొంతకాలం డ్రైవర్‌గా పనిచేసిన నరేంద్ర శ్రీనివాస్.. తన ఖర్చులకు ఆదాయం సరిపోకపోవడంతో డ్రగ్స్ విక్రయాల వైపు మళ్లినట్టు ఈగల్ ఫోర్స్ తెలిపింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పడువాకు చెందిన హరి అనే డ్రగ్ సరఫరాదారుతో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం పెంచుకొని హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో విక్రయించేవాడు. ఈ కేసులో వినియోగదారులపై కూడా దృష్టిపెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

