ఇరాన్ సుప్రీం లీడన్ ఖమేనీని అంతం చేస్తేనే ఇరు దేశాల మధ్య యుద్ధానికి త్వరగా ముగింపు పడుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీసీ న్యూస్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇరాన్‌పై దాడులను సమర్థించుకున్నారు.
ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ పన్నిన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీటో చేసిన నేపథ్యంలో నెతన్యాహు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.