Israel | ఇజ్రాయెల్ (Israel) ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ (Netanyahu)పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ( International Criminal Court) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లెంట్, హమాస్ అధికారులపైనా ఈ వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
గాజాలో చేస్తున్న యుద్ధంలో యుద్ధనేరాలకు, మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నెతన్యాహూ, గల్లెంట్పై, 2023 అక్టోబరులో ఇజ్రాయెల్‌పై దాడికి పాల్పడినందున హమాస్ అధికారులపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అరెస్టు వారెంట్లు జారీ చేసింది. హత్య, హింస, అమానవీయ చర్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు వారు పాల్పడినట్లు ఆరోపించింది. గాజాపై దాడులతోపాటు పౌరులకు ఆహారం, నీరు, వైద్య సహాయం వంటివి అందకుండా చేశారని ఆరోపించింది. పిల్లలతో సహా మరణాలు, తీవ్రమైన మానవ సంక్షోభానికి ఇది దారితీసినట్లు పేర్కొంది.
గతేడాది అక్టోబర్ 7న గాజాపై పట్టున్న హమాస్ ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేసింది. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడంతోపాటు పలువురిని బంధించి గాజాకు తరలించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆర్మీ గాజాపై దాడులు చేసింది. మహిళలు, పిల్లలతో సహా వేలాది మంది మరణించారు. వైమానిక దాడుల్లో ఆసుపత్రులు, స్కూళ్లు వంటివి నేలమట్టమయ్యాయి.
Also Read..
Explosion | ఢిల్లీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు
PM Modi | ప్రధాని మోదీ హత్యకు ప్లాన్ అంటూ బెదిరింపు కాల్.. అప్రమత్తమైన పోలీసులు
Delhi | ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్లో అత్యంత శీతల పరిస్థితులు