జెరూసలెం : పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ స్ధావరాలను నేలమట్టం చేయడంతో పాటు ఉగ్రసంస్ధ విధ్వంసం దిశగా తమ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ రక్షణ దళాల (IDF) ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ పీటర్ లెర్నర్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులకు దిగినప్పటి నుంచి ఉగ్ర సంస్ధ లక్ష్యంగా ఐడీఎఫ్ వందలాది దాడులతో విరుచుకుపడిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌తో పాటు తమ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడేందుకు గాజా స్ట్రిప్‌ను వేదికగా చేసుకునేందుకు హమాస్‌ను అనుమతించబోమని అన్నారు.
హమాస్ సామర్ధ్యాలను, దాని మౌలిక వసతులను ధ్వంసం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత తాము ఉగ్రసంస్ధ లక్ష్యంగా పదిరోజుల నుంచి దాడులు చేపడుతున్నామని, ఇజ్రాయెల్ పౌరుల భద్రతను పునరుద్ధరించే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. తామిప్పటికే పలువురు ఉగ్రవాదులతో పాటు హమాస్ నేతలను హతమార్చామని వెల్లడించారు.
Read More :
Israel : గాజాలో బందీ అయిన 199 మంది ఇజ్రాయిలీలు