గాజా: పాలస్తీనాకు చెందిన హమాస్, ఇజ్రాయిల్(Israel) మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే గాజాలో ఉన్న హమాస్ ఉగ్రవాదుల ఆధీనంలో సుమారు 199 మంది బందీగా ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. హమాస్ ఉగ్రవాదులు 199 మందిని కిడ్నాప్ చేశారని ఐడీఎఫ్ వెల్లడించింది. మిలిటరీ ప్రతినిధి డానియల్ హగారే ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. తొలుత 155 మందిని కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఖ్యను 199కి పెంచేశారు.
బందీలుగా తీసుకెళ్లినవారిలో ప్రాధానంగా వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఉన్నారు. గాజా స్ట్రిప్‌లో ఉన్న బందీల గురించి కొంత సమాచారం తమకు చేరినట్లు ఐడీఎఫ్ ప్రతినిధి హగేరి తెలిపారు. అయితే గాజాలో ఎక్కవ తమ వాళ్లు బందీలుగా ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.తమ ప్రజల జీవితాలు ప్రమాదంలో పడే ఎటువంటి చర్యలు చేపట్టబోమన్నారు.