Iran | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ (Tehran) సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ గగనతల రక్షణ నిల్వలు నిండుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు అమెరికా అధికారిని ఊటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది.
గతవారం ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మిస్సైళ్లతో టెహ్రాన్‌పై విరుచుకుపడుతోంది. అదే సమయంలో ఐడీఎఫ్ దాడులను అడ్డుకునేందు ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇప్పటివరకూ దాదాపు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించే ఈ క్షిపణులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ యూరో సిస్టమ్‌ను వినియోగిస్తోంది.
దీంతోపాటు డేవిడ్స్ స్లింగ్, అమెరికా సరఫరా చేసిన పాట్రియాట్స్, థాడ్ బ్యాటరీస్ వంటి అధునాతన లేయల్డ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థలను రంగంలోకి దింపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వీటిని ప్రయోగిస్తూనే ఉంది. దీంతో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిల్వలు ఖాళీ అవుతున్నట్లు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ నివేదించింది. ఇంకో 10-12 రోజులు మాత్రమే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేస్తాయని పేర్కొంది. ఈ పదిరోజుల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థ క్షీణిస్తుందని వెల్లడించింది. అమెరికా నుంచి సాయం అందితే గానీ ఇజ్రాయెల్ దీన్నుంచి గట్టెగలేదని తెలిసింది.
Also Read..
Iran | తమ డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను తొలగించాలని ప్రజలకు ఇరాన్ సూచన.. మెటాపై సంచలన ఆరోపణలు
Israel-Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 585 మంది మృతి
Fordo Nuclear Plant: ఫోర్డో అణు కేంద్రంపై అందరి దృష్టి.. బంకర్ బస్టర్ బాంబే శరణ్యమా !