Iran | ఇరాన్, ఇజ్రాయెల్ (Israel-Iran) యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. వరుసగా ఆరో రోజు కూడా ప్రతిదాడులతో ఇరు దేశాలూ విరుచుకుపడుతున్నాయి. ఇక ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణువుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ (Tehran) సహా పలు కీలక ప్రాంతాలు, నగరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ (Iran) తన ప్రజలకు కీలక సూచన చేసింది. దేశ ప్రజలు తక్షణమే తమ స్మార్ట్ఫోన్ల నుంచి ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp)ను తొలగించాలని సూచించింది.
ఈ సందర్భంగా మెటాపై సంచలన ఆరోపణలు చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్‌కు చేరవేస్తోందని ఆరోపించింది. ఈ మేరకు ప్రభుత్వ మీడియా సంస్థ ద్వారా ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇరాన్ ఆరోపణలపై మెటా తీవ్రంగా స్పందించింది. తమ సేవలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేయడానికి ఇలాంటి తప్పుడు నివేదికలు సాకుగా ఉపయోగపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. లొకేషన్లను, ఎవరి వ్యక్తిగత మెసేజ్‌లను ట్రాక్ చేయమని తెలిపింది. అంతేకాదు తాము ఏ ప్రభుత్వంతోనూ సమాచారాన్ని పంచుకోమని స్పష్టం చేసింది.
Also Read..
Israel-Iran | ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 585 మంది మృతి
Israel Attack: ఇరాన్ సెంట్రిఫ్యూజ్ ప్రొడక్షన్.. మిస్సైల్ ఫ్యాక్టరీలు ధ్వంసం: ఐడీఎఫ్
Russia: ఇరాన్‌పై దాడి అంతర్జాతీయ భద్రతకు ముప్పు: రష్యా