మాస్కో: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులను రష్యా(Russia) ఖండించింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలను టార్గెట్ చేయడం ఆమోదయోగ్యం కాదు అని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నది. అణు కేంద్రాలను దాడి చేయడం వల్ల అంతర్జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రష్యా హెచ్చరించింది. ఇరాన్‌ఫై దాడితో ప్రపంచ దేశాలను విపత్తులోకి నెట్టేస్తున్నారని రష్యా విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. గత శుక్రవారం నుంచి ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రెండు దేశాల మధ్య వాయు ఘర్షణ అయిదో రోజుకు చేరుకున్నది. న్యూక్లియర్ బాంబును ఇరాన్ రూపొందిస్తున్నట్లు, అది తుది దశకు చేరుకున్నట్లు టెహ్రాన్‌పై ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేసింది. ఇజ్రాయిలీ సైనిక ఆపరేషన్‌కు దీటుగా బదులిస్తోంది. తాజాగా హైపర్సోనిక్ క్షిపణులను కూడా రిలీజ్ చేసింది.
ఇరాన్‌లోని అణు కేంద్రాలు శాంతియుతంగా ఉన్నాయని, కానీ వాటిపై ఇజ్రాయిల్ భీకర దాడులు చేయడం.. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని రష్యా పేర్కొన్నది. అంతర్జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని రష్యా విదేశాంగ శౄఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకవేళ ఈ దాడులు ఇలాగే కొనసాగితే, ఆ ప్రాంతం మొత్తం సమస్యాత్మకంగా మారుతుందని రష్యా తెలిపింది. విచక్షణతో ఆలోచించి, అణు కేంద్రాలపై దాడుల్ని ఆపాలని ఇజ్రాయిల్‌ను రష్యా కోరింది. ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్న దేశాలు.. ఆ దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు రష్యా విదేశాంగ శాఖ చెప్పింది.
అంతర్జాతీయ అటాక్ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా వత్తిడి తీసుకువచ్చి, టెహ్రాన్‌పై అటాక్ చేసినట్లు రష్యా పేర్కొన్నది. దీని వల్ల ప్రస్తుత విషాదం నెలకొన్నట్లు చెప్పింది. పశ్చిమ దేశాలు అణు నిరాయుధీకరణ పేరుతో అంతర్జాతీయ దేశాలతో వత్తిడి తెస్తున్నట్లు రష్యా తెలిపింది. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ(ఎన్పీటీ) ఒప్పందాలను ఇరాన్ ఉల్లంఘించినట్లు ఐఏఈఏ పేర్కొన్న విషయం తెలిసిందే. ఎన్పీటీ రూల్స్‌ను ఇరాన్ బ్రేక్ చేసిందన్న విషయాన్ని అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.