టెల్ అవివ్: ఇరాన్‌లోని సెంట్రిఫ్యూజ్ ఉత్పత్తి యూనిట్లు, మిస్సైల్ ఫ్యాక్టరీలపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్(Israel Attack) రక్షణ దళాలు పేర్కొన్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో సుమారు 50 యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఇరానియన్ సెంట్రిఫ్యూజ్ ప్రొడక్షన్ సైట్‌తో పాటు వెపన్ ప్రొడక్షన్ కేంద్రాలు ధ్వంసమైనట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. టెహ్రాన్‌లో సెంట్రిఫ్యూజ్ తయారీ కంపెనీ ఉన్నది. అయితే అణ్వాయుధాల అభివృద్ధి కోసం అవసరమైన యురేనియం శుద్దీకరణ చేపట్టేందుకు సెంట్రిఫ్యూజ్‌లు కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే ఆ తయారీ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.
ఆయుధ ఉత్పత్తి ఫ్యాక్టరీల్లో ముడి వస్తువులు, విడి భాగాలు తయారు చేస్తాయని ఇజ్రాయిల్ మిలిటరీ చెప్పింది. సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైళ్లకు అవసరమైన పరికరాలను ఆ కంపెనీల్లో ఉత్పత్తి చేస్తారు. ఇజ్రాయిల్‌పై దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను ఆ కేంద్రాల్లో తయారీ చేస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లను పేల్చేందుకు అవసరమైన సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైళ్లకు చెందిన విడి భాగాలు ఆ కంపెనీల్లో తయారువుతుంటాయి. ఆపరేషన్‌లో పాల్గొన్న యుద్ధ విమానాలకు చెందిన వీడియోలను ఐడీఎఫ్ రిలీజ్ చేసింది.
ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇరాన్‌కు చెందిన 585 మంది మృతిచెందారు. 1326 మంది గాయపడినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. మృతుల్లో 239 మంది సాధారణ పౌరులు, 126 మంది సెక్యూర్టీ సిబ్బంది ఉన్నట్లు మానవ హక్కుల సంస్థ పేర్కొన్నది.
צה”ל תקף הלילה אתר ייצור צנטריפוגות ומספר אתרי ייצור אמצעי לחימה של המשטר האיראני
יותר מ-50 מטוסי קרב של חיל האוויר, בהכוונה מודיעינית מדויקת של אגף המודיעין, השלימו בשעות האחרונות סדרת תקיפות של מטרות צבאיות במרחב טהראן.
במסגרת המאמץ הנרחב לפגוע בתכנית לפיתוח הנשק הגרעיני… pic.twitter.com/RNAAvSChgl
— צבא ההגנה לישראל (@idfonline) June 18, 2025