Gaza | టెల్ అవీవ్ : గత నెలలో హమాస్‌పై తిరిగి యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయెల్.. గాజాపై మరింత పట్టు సాధించింది. 50 శాతం గాజా ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ సరిహద్దు వెంబడి గాజాలో ఒక పద్ధతి ప్రకారం బఫర్ జోన్‌ను విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొన్నది. పాలస్తీనియన్లు తిరిగి వెనక్కి రాకుండా, ఒకవేళ వచ్చి నా..అక్కడ ఉండేందుకు ఎలాంటి ఆవాసం లేకుండా అంతా ధ్వంసం చేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇజ్రాయెల్ సైన్యం, హక్కుల సంఘాలు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఇటీవలి కాలంలో గాజా స్ట్రిప్‌లో మిలిటరీ బఫర్ జోన్ రెట్టింపైంది.