జెరూసలెం, అక్టోబర్ 28: వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన హమాస్‌పై వెంటనే శక్తివంతమైన దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను(ఐడీఎఫ్) ప్రధాని నెతన్యాహు మంగళవారం ఆదేశించారు. ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన హమాస్‌పై తీసుకోవలసిన చర్యలను చర్చించేందుకు సమావేశమైన నెతన్యాహు వెంటనే గాజా స్ట్రిప్‌పై శక్తివంతమైన దాడులు ప్రారంభించాలని ఆదేశించినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
దక్షిణ గాజా ప్రాంతంలో ఇజ్రాయెలీ దళాలపై హమాస్ దాడులు జరిపిన నేపథ్యంలో నెతన్యాహు ఈ చర్యలు చేపట్టారు. ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను హమాస్ అప్పగించకపోవడంతోసహా పదేపదే ఒప్పంద ఉల్లంఘనలకు హమాస్ పాల్పడినట్లు నెతన్యాహు ఆరోపించారు.