Israel-Iran | ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య యుద్ధం తొమ్మిదో రోజుకు చేరింది. టెహ్రాన్‌లోని అణు కేంద్రాలే లక్ష్యంగా ఐడీఎఫ్ దళాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇజ్రాయెల్ జరుపుతున్న ఈ దాడుల్లో ఇరాన్‌వైపు భారీ నష్టం వాటిల్లుతున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఇరాన్‌కు చెందిన పలువురు కీలక కమాండర్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం (Revolutionary Guards Air Force) డ్రోన్ యూనిట్ కమాండర్ (Iranian commander) అమీన్ జుడ్ఖిని హతమార్చినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఇటీవలే టెల్ అవీవ్‌పై ఇరాన్ చేసిన డ్రోన్ దాడుల వెనుక అతని హస్తం ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్‌లోని అహ్వాజ్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపింది.
మరోవైపు ఇరాన్‌లోని కీలక అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్‌లోని కీలక అణు కేంద్రానికి (nuclear research site) నిలయమైన ఇస్ఫహాన్ (Isfahan) నగరంపై ఇజ్రాయెల్ దళాలు దాడులు జరిపినట్లు ఇరాన్ తాజాగా పేర్కొంది. అయితే, ఈ దాడిలో ఎలాంటి ప్రమాదకర వాయువులు లీక్ అవ్వలేదని తెలిపింది. అక్కడ అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో దద్దరిల్లినట్లు తెలిపింది. మరోవైపు ఖొండాబ్ అణు పరిశోధనా రియాక్టర్ సమీపంలోని ప్రాంతంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు పేర్కొంది.
Also Read..
Israel-Iran | ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు
Barak System: డీఆర్డీవో అభివృద్ధి చేసిన బరాక్ మిస్సైల్ సిస్టమ్ వాడుతున్న ఇజ్రాయిల్
Israel-Iran | ఇజ్రాయెల్ దురాక్రమణను భారత్ ఖండించాలి : ఇరాన్