Israel-Hamas War | హమాస్ మిలిటెంట్లను ఏరిపారేస్తున్న ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో
Israel-Hamas War | తమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఏరిపారేస్తున్నారు.
Israel-Hamas War | తమ దేశంపై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas) చేపట్టిన దాడులను ఇజ్రాయెల్ (Israel) ధీటుగా ఎదుర్కొంటోంది. హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఏరిపారేస్తున్నారు. సరిహద్దులు దాటి తమ దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులను వెంబడించి మరీ షూట్ చేసి పారేస్తున్నారు. తాజాగా గాజా సరిహద్దు (Gaza Border)లో ఇద్దరు హమాస్ మిలిటెంట్లను గుర్తించిన ఇజ్రాయెల్ పోలీసులు (Israel Cops) వారిని వెంబడించి మట్టుపెట్టారు.
హాలీవుడ్ యాక్షన్ సినిమా తరహాలో ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు ఛేజ్ చేశారు. ఓ కారులో ఇద్దరు పోలీసులతో పాటు బైక్పై మరో ఆఫీసర్ వారిని వెంబడించారు. ఈ క్రమంలో బైక్పై వెళ్తున్న పోలీసు అధికారి గన్ చేతపట్టి మిలిటెంట్లపై కాల్పులు జరిపాడు. అనంతరం కారులో వెళ్తున్న మరో ఇద్దరు పోలీసులు కూడా పలు రౌండ్లు కాల్పులు జరపడంతో మిలిటెంట్లు చనిపోయారు. ఇదంతా బైక్ నడుపుతున్న పోలీస్ ఆఫీసర్ యూనిఫాంకు అమర్చిన వీడియోలో రికార్డ్ అయింది. ఈ వీడియోను ఇజ్రాయెల్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది.
Police and Border Police officers heroically neutralized two armed terrorists outside of Netivot on Saturday. We will continue working on the front lines to defend our civilians from terror pic.twitter.com/PQk9KiiKoT
— Israel Police (@israelpolice) October 9, 2023
Also Read..
Israel-Hamas War | హమాస్ దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి.. వ్యవసాయ పొలంలో 100 మృతదేహాలు లభ్యం
Israel-Hamas War | మా భూభాగంలో 1500 మంది హమాస్ మిలిటెంట్ల మృతదేహాలు.. ప్రకటించిన ఇజ్రాయెల్ సైన్యం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

