Army Defuses Bombs | రోడ్డుపై అమర్చిన మూడు బాంబులు.. నిర్వీర్యం చేసిన ఆర్మీ
Army Defuses Bombs | రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అల్లాడిన మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది.
ఇంఫాల్: రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. (Army Defuses Bombs) అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అల్లాడిన మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని నోంగ్‌డామ్, ఇథమ్ గ్రామాలను కలిపే రహదారిపై ఐఈడీలను అమర్చినట్లు ఆర్మీ సిబ్బంది ఆదివారం గుర్తించారు. ఆ వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ రోడ్డును మూసివేశారు. బాంబు స్క్వాడ్‌ను అక్కడకు రప్పించారు. మూడు బాంబులను నిర్వీర్యం చేశారు.
కాగా, ఆర్మీ జవాన్ల రొటీన్ తనిఖీల సందర్భంగా రోడ్డుపై అమర్చిన ఐఈడీలను గుర్తించినట్లు ఆర్మీ అధికారి తెలిపారు. మాఫౌ డ్యామ్, నోంగ్‌డామ్ గ్రామానికి సమీపంలో ఈ బాంబులు ఉన్నట్లు చెప్పారు. బాంబు స్క్వాడ్ సహాయంతో రోడ్డుపై అమర్చిన ఐఈడీలను నిర్వీర్యం చేసినట్లు వివరించారు. దీంతో ప్రాణ నష్టం జరుగకుండా, స్థానికులకు గాయాలు కాకుండా నిరోధించినట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

