Iran | ఇజ్రాయెల్ (Israel)తో ఉద్రిక్త పరిస్థితుల వేళ అణుబాంబు (Nuclear Bomb) తయారీ విషయంలో ఇరాన్ (Iran) కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ అణుబాంబు తయారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అయితే, అవసరమైతే మాత్రం తమ దేశం అణువిధానం మార్చుకొనేందుకు ఏమాత్రం వెనుకాడదని ఇజ్రాయెల్ను హెచ్చరించింది.
ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ అణుబాంబు తయారీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇరాన్ ఉనికి ప్రమాదంలో పడితే మాత్రం మా సైనిక విధానం మార్చుకోవాల్సి ఉంటుంది. మా అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడిచేస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయ్’ అని ఆయన హెచ్చరించారు.
Also Read..
Ink Mark | తొమ్మిదేళ్లయినా చెరగని సిరా గుర్తు.. కేరళ మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్
Telugu Students | అమెరికాలో విషాదం.. జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Badrinath Temple | తెరుచుకున్న బద్రినాథ్ ఆలయ తలుపులు.. పోటెత్తిన భక్తులు