వాషింగ్టన్ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరనసలపై ఆ దేశం ఉక్కుపాదం మోపుతుండటంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇరాన్‌పై చేయదగిన దాడుల గురించి అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ అధికారులు వివరించారు. ఇరాన్ భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం గురించి అధికారులు ట్రంప్‌నకు వివరించారు. అయితే, ట్రంప్ తుది నిర్ణయం తీసుకోలేదు. నిరసనకారులపై ఖమేనీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం కొనసాగితే, పరిమిత స్థాయిలో దాడులు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం చూస్తున్నదని, ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఆకాంక్ష ఉందని ట్రంప్ చెప్పారు. నిరసనకారులకు సాయపడటానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ శాఖ ప్రత్యేకంగా ఓ హెచ్చరిక చేసింది. “ప్రెసిడెంట్ ట్రంప్‌తో ఆటలొద్దు. తాను ఏదో చేస్తానని ఆయన అంటే దాని అర్థం ఆయనకు తెలుసు” అని పేర్కొంది. మరోవైపు, ఇరాన్‌పై అమెరికా జోక్యం చేసుకోనున్నట్టు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ హైఅలర్ట్ ప్రకటించింది.
ఇరాన్‌పై దాడులకు సిద్ధమేనంటూ ట్రంప్ చెప్తుండటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణిస్తున్నది. ఇరాన్ పార్లమెంట్లో సభ్యులు “డెత్ టు అమెరికా” అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ మహ్మద్ బాఘెర్ కలిబఫ్ స్పందిస్తూ, అమెరికా సైన్యం, ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారుతాయని హెచ్చరించారు. తాము అత్యంత తీవ్రంగా వ్యవహరిస్తామని ఇరాన్ ప్రజలు తెలుసుకోవాలని, అరెస్టయిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ‘ఆక్రమిత భూభాగం’ (ఇజ్రాయెల్), అమెరికన్ మిలిటరీపై ముందస్తు దాడులు జరుగుతాయన్నారు. అమెరికాలోని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నదాని ప్రకారం, ఇరాన్ నిరసనకారులపై కఠిన చర్యల వల్ల మృతుల సంఖ్య పెరుగుతున్నదని, సుమారు 2,600 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తున్నది.
నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండటంతో అనేక మంది మరణిస్తున్నారు, వందల మంది గాయపడుతున్నారు. దీంతో రాజధాని నగరం టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా దవాఖానల్లో శవాలు ఒకదానిపై మరొకటి పడి ఉన్నాయని, రోగులతో వార్డులు కిటకిటలాడుతున్నాయని మెడికల్ వర్కర్స్ చెప్పారు. ఉత్తర ఇరాన్‌లోని రష్త్లో ఉన్న పోర్సినా
హాస్పిటల్‌కు శుక్రవారం రాత్రి 70 మృతదేహాలు రావ డంతో మార్చురీ నిండిపోపోయిందని వారు తెలిపారు.