ఇరాన్‌కు డెడ్‌లైన్ మరో 10 రోజులు పొడిగింపు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో మెట్టు దిగారు. యూఎస్-ఇజ్రాయెల్‌తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు.
- ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో మెట్టు దిగారు. యూఎస్-ఇజ్రాయెల్‌తో యుద్ధ విరమణకు అమెరికా ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరించినప్పటికీ హొర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌లోని విద్యుత్ వ్యవస్థలను నాశనం చేస్తామంటూ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు. గతంలో తాను ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్‌ను ఉపసంహరించి ఇరాన్‌కు మరో ఐదు రోజులు గడువిస్తున్నట్టు ఈ నెల 23న ట్రంప్ ప్రకటించారు. అయితే దానికి స్పందన లేకపోవడంతో మరోసారి తన గడువు పొడిగించారు. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లపై దాడులను 10 రోజుల పాటు నిలిపివేస్తామని ఏప్రిల్ 6వ తేదీ 8 పీఎం వరకు దానికి డెడ్‌లైన్ విధిస్తున్నట్టు గురువారం ప్రకటించారు.
ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన 15 షరతులను ఇరాన్ తిరస్కరించడమే కాక, తమ డిమాండ్లను అమెరికా ముందు ఉంచి, అవి నెరవేరుస్తానంటేనే యుద్ధ విరమణ చేస్తామని పేర్కొంది. ఈ విషయంలో ఆ దేశంతో నేరుగా ఎలాంటి చర్చలు జరపమని, దీనిపై రాజీపడబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా అమెరికా-ఇజ్రాయెల్ దేశాలతో పాటు వాటి మిత్ర దేశాలకు చెందిన వాణిజ్య నౌకల రాకపోకలను హొర్ముజ్ జలసంధి మీదుగా అంగీకరించబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పునరుద్ఘాటించింది. కాగా, ‘ఫేక్ న్యూస్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి’ అని ట్రంప్ తాజాగా ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

