వాషింగ్టన్, అక్టోబర్ 10 : అరుదైన ఖనిజాల ఎగుమతిపై బీజింగ్ తాజాగా ఆంక్షలు విధించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ‘దుష్ట, శత్రుత్వపూరితమైన చర్య’ తీసుకుందని ఆయన ఆరోపించారు.
ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కావడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని అన్నారు. అమెరికాలో ప్రవేశించే చైనా వస్తువులపై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.