వాషింగ్టన్, సెప్టెంబర్ 14: వచ్చే 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే 75 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు.
ఎఫ్బీఐ వంటి పలు ప్రధాన ఏజెన్సీలను మూసివేయనున్నట్టు వెల్లడించారు. అత్యధిక సిబ్బంది ఉండే సంస్థల్లో ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలు చేయనున్నట్టు తెలిపారు.