వాషింగ్టన్ : (Neera Tandon) అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులకు గౌరవం మెల్లమెల్లగా పెరుగుతున్నది. ఇప్పటికే చాలా మందిని సలహాదారులుగా, వివిధ హోదాల్లో నియమించిన అమెరికా ప్రభుత్వం.. ప్రస్తుతం మరో భారత సంతతి వ్యక్తికి ఉన్నత పదవి కట్టబెట్టి గౌరవించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సహాయకురాలుగా పరిగణిస్తున్న భారత సంతతి పాలసీ నిపుణురాలు నీరా టాండన్‌ను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించారు. తెరవెనుక పనిచేసే స్టాఫ్ సెక్రటరీకి వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఇక్కడి నుంచే ప్రభుత్వ పరిపాలనా విభాగాల ఫైళ్లు అధ్యక్షుడికి చేరుతాయి. స్టాఫ్ సెక్రటరీని వైట్ హౌస్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా పరిగణిస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు.
వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమితులైన నీరా టాండన్ .. ప్రత్యేక ప్రాజెక్టులు, కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆమె వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లైన్‌కు రిపోర్ట్ చేయనున్నది. గత మే నెలలోనే నీరా టాండన్ వైట్ హౌస్ సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌లో సీనియర్ అడ్వైజర్‌గా ఉన్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మక హెల్త్ ప్రాజెక్ట్‌లో కూడా పనిచేశారు. బిల్ క్లింటన్ సమయంలో వైట్ హౌస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. హిల్లరీ క్లింటన్‌కు విధాన సలహాదారుగా ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, యేల్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రం డిగ్రీని పొందారు.
అలా విడుదలైన 110 మంది రాజకీయ ఖైదీలు.. ఇలా మళ్లీ అరెస్ట్
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
లఖింపూర్ ఖేరీ ఘటనలో మరో ముగ్గురు అరెస్ట్
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఫైజాబాద్ రైల్వేస్టేషన్ ఇక అయోధ్య కంటోన్మెంట్!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఇస్కాన్ ప్రదర్శనలు
యాపిల్ దశ దిశను మార్చిన తొలి ఐపాడ్
జమ్ములో హోం మంత్రి పర్యటన.. అమరుల కుటుంబాలకు పరామర్శ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..