Indian-Origin Couple | అగ్రరాజ్యం అమెరికా (America)లో విషాదం చోటు చేసుకుంది. న్యూజెర్సీ (New Jersey) రాష్ట్రంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన దంపతులు (Indian-Origin Couple), వారి ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారంతా ఇంట్లోనే శవాలై కనిపించారు. ఘటనపై న్యూజెర్సీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
భారత సంతతికి చెందిన తేజ్ ప్రతాప్ సింగ్ (43) తన భార్య సోనాల్ పరిహార్ (42) 10 ఏళ్ల కుమారుడు, 6 ఏళ్ల కుమార్తెతో కలిసి ప్లెయిన్స్ బోరోలోని ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ప్లెయిన్స్‌బోరో పోలీస్ డిపార్ట్మెంట్ (Plainsboro Police Department) కంట్రోల్ రూమ్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అందులో తేజ్ ప్రతాప్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే తేజ్‌ప్రతాప్ కుటుంబం నివసించే ఇంటికి చేరుకున్నారు. అక్కడ నలుగురూ విగతజీవులై కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి మృతికిగల కారణాలు తెలియరాలేదు.
Also Read..
Air India | ఎయిర్ ఇండియా విమానాల కొత్త లుక్.. ఫొటోలు వైరల్
Playing Card Structure | ప్లేయింగ్ కార్డ్స్‌తో భారీ నిర్మాణం.. వరల్డ్ రికార్డ్ సృష్టించిన బాలుడు