Parineeti-Raghav Chadha | బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) వివాహం ఇటీవలే అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్ ఉదయ్‌పూర్ (Udaipur)లోని లీలా ప్యాలెస్ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను పరిణీతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
కాగా, పెళ్లి అనంతరం అత్తారింట్లో పరిణీతికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. కొత్త కోడలు మొదటిసారి రాబోతుండటంతో చద్దా కుటుంబం ఇంటిని ఎంతో అందంగా అలంకరించి.. ప్రత్యేకంగా స్వాగతం పలికింది. దీంతో పరిణీతి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అనంతరం సాంప్రదాయబద్దంగా అత్తింట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా చద్దా కుటుంబం కొత్త జంటకు కొన్ని ఫన్నీ గేమ్స్ పెట్టారు.ఈ ఆటల్లో పరిణీతి ఎంతో చురుగ్గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
రాఘవ్-పరిణీతి వివాహం ఈనెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన పెళ్లి ఫొటోలు, వీడియోలను కొత్త జంట సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Rs 2,000 Notes | రూ. 2000 నోట్ల డిపాజిట్‌కు నేటితో ముగియనున్న గడువు
Air India | ఎయిర్ ఇండియా విమానాల కొత్త లుక్.. ఫొటోలు వైరల్
Playing Card Structure | ప్లేయింగ్ కార్డ్స్‌తో భారీ నిర్మాణం.. వరల్డ్ రికార్డ్ సృష్టించిన బాలుడు