Playing Card Structure | ప్లేయింగ్ కార్డ్స్‌తో భారీ నిర్మాణం.. వరల్డ్ రికార్డ్ సృష్టించిన బాలుడు
Playing Card Structure | కోల్‌కతా (Kolkata)కు చెందిన 15 ఏళ్ల అర్నవ్ ప్లేయింగ్ కార్డ్స్ (Playing Cards)తో అసాధారణ రీతిలో భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించాడు.
Playing Card Structure | జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉండాలే గానీ, సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అందుకు తగ్గట్టు పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధించగలం. అందుకు నిదర్శనమే ఈ 15 ఏళ్ల బాలుడు. తన ప్రతిభతో ఏకంగా వరల్డ్ రికార్డు సృష్టించాడు.
కోల్‌కతా (Kolkata)కు చెందిన 15 ఏళ్ల అర్నవ్ ప్లేయింగ్ కార్డ్స్ (Playing Cards)తో అసాధారణ రీతిలో భారీ నిర్మాణాన్ని చేపట్టాడు. 1.43 లక్షల ప్లేయింగ్ కార్డ్స్‌ను ఉపయోగించి.. కోల్‌కతాలోని ప్రఖ్యాతిగాంచిన రచయితల భవనం, షామిద్ మినార్, సాల్ట్ లేక్ స్టేడియం, ఎస్టీ. పాల్ కేథడ్రల్‌లను నిర్మించి రికార్డు సృష్టించాడు. కేవలం 41 రోజుల్లోనే ఈ నాలుగు నిర్మాణాలను పూర్తిచేశాడు. ఎలాంటి టేపు సాయం లేకుండా ఈ భవనాలను నిర్మించడం విశేషం. ఇప్పుడు ఈ నిర్మాణం ప్రపంచంలోనే ‘అతిపెద్ద ప్లేయింగ్ కార్డ్స్ నిర్మాణం’ (Largest Playing Card Structure)గా రికార్డుకెక్కింది. గతంలో బ్రయాన్ బెర్గ్ పేరిట ఉన్న రికార్డును అర్నవ్ బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Guinness World Record) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాగా, అర్నవ్ చేపట్టిన ఈ మొత్తం ప్రాజెక్ట్ పొడవు 40 అడుగులు కాగా, ఎత్తు 11 అడుగుల 4 అంగుళాలు. వెడల్పు 16 అడుగుల 8 అంగుళాలు అని గిన్నిస్ వరల్డ్ రికార్డు తెలిపింది.
Also Read..
Rs 2,000 Notes | రూ. 2000 నోట్ల డిపాజిట్‌కు నేటితో ముగియనున్న గడువు
Air India | ఎయిర్ ఇండియా విమానాల కొత్త లుక్.. ఫొటోలు వైరల్
Gaganyaan Crew Module: గగన్‌యాన్ క్రూ మాడ్యూల్ పరీక్షకు రెఢీ.. ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

