మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Aug 18, 2020 , 20:17:19

స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌..భారత రాయబార కార్యాలయం చర్చలు

స్పుత్నిక్‌-వి  వ్యాక్సిన్‌..భారత రాయబార కార్యాలయం  చర్చలు

న్యూఢిల్లీ: రష్యా కొవిడ్‌-19 వ్యాక్సిన్(స్పుత్నిక్‌-వి)పై భారత్‌ ఆసక్తి చూపిస్తున్నది. వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు అందించాలని రష్యాను భారత్‌ కోరుతున్నది.ఈ నేపథ్యంలోనే మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యాన్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది.ప్రపంచంలోనే తొలి కొవిడ్‌-19 వ్యాక్సీన్‌ను అత్యవసర ప్రాతిపదికన రష్యా వినియోగంలోకి తీసుకొచ్చింది. 

మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇండియన్‌ మిషన్‌ రష్యాతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నది.కొవిడ్‌-19 టీకా భద్రత, సామర్థ్యం తదితర సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు  విశ్వసనీయ వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాయి. స్పుత్నిక్‌-వి టీకాను రష్యాకు చెందిన  గమేలియా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమలాజీ, మైక్రోబయాలజీ సంస్థ  అభివృద్ధి చేసింది. 


logo