న్యూయార్క్: ఇరాన్ ముడి చమురుకు బదులుగా.. వెనిజులా నుంచి ఇండియా తన ఇంధనాన్ని కొనుగోలు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వాణిజ్యంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్న సంకేతాన్ని ట్రంప్ వినిపించారు. చమురు ఒప్పందం విషయంలో చైనాను స్వాగతిస్తున్నామని, ఆ దేశంతో డీల్ గొప్పగా ఉంటుందని, చైనాను స్వాగతిస్తామన్న విషయం తెలిసిందే అని, ఇప్పటికే కొన్ని డీల్స్ చేసుకున్నామని, ఇండియా కూడా వస్తోందని, ఆ దేశం వెనిజులా ఇంధనాన్ని కొనుగోలు చేయనున్నదని ట్రంప్ అన్నారు.
ఇరాన్‌కు బదులుగా వెనిజులా నుంచి భారత్ తన ఇంధనాన్ని ఖరీదు చేస్తుందని ట్రంప్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఆయన రిపోర్టర్లతో ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే డీల్ కుదుర్చుకున్నామని, డీల్ కాన్సెప్ట్ తెలుసు అన్నారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి తగ్గినందుకు వల్ల.. వెనిజులా నుంచి ఆయిల్‌ను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇటీవల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.