Peter Navarro | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాణిజ్య సలహాదారు పీటర్ నవర్రో (Peter Navarro) మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర విమర్శలు చేశారు. సాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ కావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఇద్దరు నియంతలతో మోదీ భేటీ సిగ్గు చేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవర్రో మాట్లాడుతూ.. ‘భారత ప్రధాని మోదీ.. పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదు’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బ్రాహ్మణులు లాభపడుతున్నారు..
ఇండియా దిగుమతులపై 50 శాతం సుంకాన్ని విధిస్తున్న అంశంపై నవర్రో ఇటీవలే తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత ప్రజలను వాడుకుని బ్రహ్మణులు లాభపడుతున్నారని, దీన్ని ఆపాలని ఆయన అన్నారు. రష్యాకు లాండ్రీగా ఇండియా మారినట్లు ఆయన ఆరోపించారు. అమెరికాకు పోటీగా వాణిజ్య అసమానతలను ఇండియా సృష్టిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్లే ఇండియాపై 50 శాతం టారీఫ్ వసూల్ చేస్తున్నట్లు నవర్రో పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ప్రాఫిటీరింగ్ బ్రహ్మిన్స్ అనే పదాన్ని వాడడం చర్చనీయాంశమైంది. ఆ పదం వాడుకపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also Read..
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించండి.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ పిలుపు
జీరో టారిఫ్‌కు భారత్ అంగీకారం.. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది: ట్రంప్