e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home News Indo-Pak War : లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు

Indo-Pak War : లాహోర్‌ను ముట్టడించిన భారత సేనలు

భారతదేశం-పాకిస్తాన్‌ మధ్య జరిగిన యుద్ధంలో (Indo-Pak War) భారత సేనలు విరోచింతంగా పోరాడి.. 1965 లో సరిగ్గా ఇదే రోజున లాహోర్‌ను ముట్టడించాయి. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మొదట పొరుగు దేశమైన చైనాతో యుద్ధం జరిగింది. అనంతరం నెహ్రూ మరణం సంభవించింది. దీన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్‌.. మనపై దండెత్తేందుకు కుట్ర పన్ని భంగపడింది. ఇదే ఇండో-పాక్‌ యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో భారత్‌దే పైచేయి అయినప్పటికీ.. తమదే విజయమని పాకిస్తాన్‌ కూడా చెప్పుకున్నది. అయితే, ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం నెరపడంతో యుద్ధానికి తెరపడింది.

భారత్‌కు చెందిన పలు ప్రాంతాలపై కన్నేసిన పాకిస్తాన్‌.. ఆపరేషన్‌ జిబ్రాల్టర్‌ చేపట్టింది. వేలాది మందికి గెరిల్లా యుద్ధమెళకువలు నేర్పిన పాక్‌.. భారత్‌కు చెందిన కశ్మీర్‌ను చిక్కించుకోవాలని కుట్ర పన్నింది. కశ్మీరీల మాదిరిగా ఆహార్యంతో కూడిన దుస్తులతో సైన్యాన్ని సిద్ధం చేసి భారత సేనలపై పురిగొల్పింది. దీనిని గుర్తించిన భారత ప్రత్యేక కమెండోలు వారి ఆటలను సాగనీయకుండా చేశారు. దాంతో ఆగ్రహించిన పాక్‌.. భారత సైనికులపై క్యానన్‌ బాల్స్‌ వేయడం ప్రారంభించింది. ఫలితంగా రెండు దేశాల మధ్య యుద్ధనీడలు అలుముకున్నాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ సైన్యం కశ్మీర్‌లోని మనకు చెందిన పూంచ్‌, యురి ప్రాంతాలను ఆక్రమించుకోగా.. మన సైనికులు 8 కిలోమీటర్ల మేర చొచ్చుకునిపోయి పీఓకేకు చెందిన హాజీ పీర్‌ పాస్‌ను ఆక్రమించింది. ఈ యుద్ధం 1965 లో ఆగస్ట్‌ నెలంతా కొనసాగింది. సెప్టెంబర్‌ 1 న ఆక్నూర్‌ సెక్టార్‌ను కైవసం చేసుకునేందుకు పాక్‌ సైన్యం ఆపరేషన్‌ గ్రాండ్‌స్లామ్‌ను చేపట్టింది.

- Advertisement -

పాకిస్తాన్‌కు దీటుగా జవాబిచ్చేందుకు భారత సేనలు పాక్‌లో చొచ్చుకునిపోయి లాహోర్‌, సియాల్‌కోట్‌ వరకు చేరుకున్నారు. అక్కడి పోలీస్‌ పోస్ట్‌లను గుప్పిట్లోకి తీసుకున్నారు. కశ్మీర్‌ను ఆక్రమించుకుందామనుకున్న పాక్‌.. అటు లాహోర్‌ భారత్‌ చేతుల్లోకి పోతుండటాన్ని గమనించి ఐక్యరాజ్య సమితి శరణుజొచ్చింది. దాంతో యూఎన్‌ ఆధ్వర్యంలో కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా చేసుకున్న తాష్కెంట్‌ ఒప్పందంపై అప్పటి ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌ శాస్త్రి, పాకిస్తాన్‌ పీఎం అయూబ్‌ ఖాన్‌ సంతకాలు చేశారు.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

2018 : హోమోసెక్సువల్‌ రాజ్యంగ విరుద్ధమన్న ఐపీసీ 377 సెక్షన్‌పై చారిత్రక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

2012 : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ నామినీగా ఎన్నికైన బరాక్‌ ఒబామా

2007 : సిరియాకు చెందిన అణు రియాక్టర్‌ను పేల్చిన ఇజ్రాయెల్‌

1997 : ముగిసిన బ్రిటన్‌ యువరాణి ప్రిన్సెస్‌ డయానా అంత్యక్రియలు

1991 : 50 ఏండ్ల కమ్యూనిస్ట్‌ పాలన నుంచి ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియాలకు విముక్తి కల్పించిన సోవియట్‌ యూనియన్‌

1988 : ఇంగ్లిష్‌ ఛానల్‌ ఈదిన అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కిన థామస్‌ గ్రెగొరీ

1969 : బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన ఆఫ్రికా దేశమైన స్వాజిలాండ్‌

1961 : అమెరికాలోని టేనెస్సీలో తొలి సూపర్‌ మార్కెట్‌ ప్రారంభం

1901 : అమెరికా 25 వ అధ్యక్షుడైన విలియం మెకిన్లీని కాల్చి చంపిన దుండగులు

1522 : ప్రపంచ యాత్రను పూర్తిచేసుకున్న విక్టోరియా నౌక

ఇవి కూడా చ‌ద‌వండి..

బార్బీ డాల్‌లా కనిపించాలని.. ఈ అమ్మడు ఏం చేసిందంటే..?

ఈ నెల 15 న పౌరుల తొలి అంతరిక్ష యాత్ర

ఏవీ లేని ఈ కాటేజ్‌కు రూ.5.5 కోట్లు.. ఎందుకో తెలుసా..?

107 భాషలు ఈ జిల్లాలో మాట్లాడతారు.. ఏ జిల్లానో తెలుసా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement