వాషింగ్టన్: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రారంభమైన మూడేళ్ల తర్వాత కూడా ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధించాలని అమెరికా యోచిస్తున్నది. రష్యాతో వాణిజ్యం చేస్తున్న భారత్, చైనాతోపాటు ఇతర దేశాల నుంచి తమ దేశంలో దిగుమతి అయ్యే వస్తువులపై 500 శాతం సుంకాలు విధించాలన్న బిల్లును ట్రంప్ తీసుకువస్తున్నారు.