Iceland | 14 గంటల్లో 800 భూ ప్రకంపనలు.. అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐస్లాండ్
Iceland | ద్వీప దేశం ఐస్లాండ్ (Iceland) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది (800 Earthquakes Within 14 Hours).
Iceland | ద్వీప దేశం ఐస్లాండ్ (Iceland) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోతోంది. అక్కడ కేవలం 14 గంటల వ్యవధిలోనే ఏకంగా 800 సార్లు భూమి కంపించింది (800 Earthquakes Within 14 Hours). రెక్జానెస్ (Reykjanes) ప్రాంతంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
శుక్రవారం ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో రెండు శక్తివంతమైన భూకంపాలు చోటు చేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.2 తీవ్రతగా నమోదైనట్లు ఐస్లాండ్ వాతావరణ విభాగం తెలిపింది. మరోవైపు ఈ ప్రకంపనలతో సమీపంలోని రహదారులు ధ్వంసమవడంతో.. రాకపోకలను అధికారులు మూసివేశారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచి సాయంత్రం వరకూ దాదాపుగా 800 సార్లు భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
వరుస భూకంపాలతో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు (State Of Emergency). ఈ ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు. అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీయోచ్చని ఐస్లాండ్ వాతావరణ విభాగం హెచ్చరించింది. భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతంలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో ఏకంగా 24 వేల ప్రకంపనలు సంభవించాయి.
Also Read..
Manish Sisodia | కోర్టు అనుమతితో.. భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా
Chandramohan | కె.విశ్వనాథ్, ఎస్పీబాలుతో చంద్రమోహన్‌కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?
Chandramohan | సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.. చంద్రమోహన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

